This is Srimati Dokka Seethamma garu (Annapurna) special postal cover in my collection. This special postal cover prepared and issued by East Godavari District Numismatic and Philatelic Association during their recent exhibition.
ఇది నేను సేకరించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ) ప్రత్యేక తపాలా కవరు. ఈ ప్రత్యేక తపాలా కవరుని తూర్పు గోదావరి జిల్లా స్టాంపులు మరియు నాణేల సేకరణ కర్తల అసోసియేషన్ ఇటీవల జరిగిన సేకరణల ఎక్సిబిషన్ సందర్భముగా విడుదల చేసింది.
Srimati Dokka Seethamma garu (Annapurna) sacrifice her entire life for the benefit of human beings by the way of offering Anna prasadam to many people during the British period of before independence. British authorities recognise her service to humanity and they want to honour her but Seethamma garu refused the same.
Smt. Dokka Seethamma garu husband Sri Dokka Joganna garu is always encouraging and helping Srimati Seethamma in her noble cause of feeding the greedy and poor people thorugh Annadanam without any time limitation.
శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ) ఆవిడ జీవిత కాలము మొత్తము ప్రజా సేవలోనే గడిపినారు. సీతమ్మ గారు ఎంతో మందికి అన్నదానము చేసి పుణ్యమూర్తి అయినారు. ఆవిడ జీవితమంతా ఎవరికీ కూడా లేదనకుండా అన్నదానము చేయడము అనే ఆశయము మరియు సేవ లోనే గడిపినారు. డొక్కా సీతమ్మ గారి భర్త శ్రీ డొక్కా జోగన్న గారు సీతమ్మ గారి యొక్క పవిత్ర ఆశయమైన ఆకలితో ఉన్నవారు మరియు పేద వారికి లేదనకుండా ఏ సమయములోనైనా అన్నదానము చేయడానికి అన్ని విధములా సహకరిస్తూ ప్రోత్సహించేవారు. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి (అన్నపూర్ణ) యొక్క సేవా నిరతిని అప్పటి బ్రిటీషు ప్రభుత్వము గుర్తించి ఆమెని సత్కరించాలని ప్రయత్నించగా శ్రీమతి డొక్కా సీతమ్మ గారు ఆనాటి
బ్రిటీషు ప్రభుత్వము యొక్క కోరికని సున్నితముగా తిరస్కరించారు.
This is a video giving information about Srimati Dokka Seethamma garu and her service.
ఇది శ్రీమతి డొక్కా సీతమ్మ గారి గురించి ఆవిడ యొక్క ఆన్నదాన సేవ ని గురించి వివరించే ఒక వీడియో.
My Grand Father Late Sri Dokka Gopalam garu told to us in our childhood days as "being a child i am sitting on the lap of Sri Dokka Joganna garu and playing games by listening stories told by him". There will be some distance relationship between Srimati Dokka Seethamma garu family members and our family members. Hailing from the roots of Srimati Dokka Seethamma garu i feel it a honour and privilege to share this special postal cover on Srimati Dokka Seethamma garu (Annapurna) through my Heritage of India blog.
మా తాతయ్య గారు శ్రీ డొక్కా గోపాలం గారు "చిన్నప్పుడు నేను డొక్కా జోగన్న గారి ఒడిలో కూర్చుని ఆడుకునేవాడిని మరియు ఆయన చెప్పే కథలు వినేవాడిని" అని మా చిన్నతనములో చెప్పేవారు. ఆ తరములో తాతముత్తాతల అన్నదమ్ముల వరుస చుట్టరికము ఏదో మాకు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి కుటుంబానికి ఉంది. డొక్కా వారి వారసత్వముగా ఆ వంశములో ఉన్న నేను శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పోస్టలు కవరుని నేను నా ఈ భారతీయ సంస్కృతి బ్లాగు ద్వారా అందరికీ పరిచయము చెయ్యడాన్ని చాలా సంతోషముగా ఉంది.