Monday 18 September 2023

Children worshipping Lord Ganesha vintage art drawing

Children worshipping  Lord Ganesha vintage art drawing with children song to praise Lord Ganesha in telugu language written by Veturi garu. Sharing this art drawing and children song today on the auspicious Ganesh Chathurthi (Vinayaka Chavithi) festival.

 


 బాల ల   పాటలు 🔻


♦ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు నేనయ్య.. 
అంటూ ఎంతో భక్తిగా చిన్నారులు సైతం
 నమస్కరిస్తూ పూజించే బంగారుకొండ 
మన  గణపయ్య .

♦ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదికీ దండు పంపు
కమ్మని నెయ్యయ్య కడు ముద్ద పప్పయ్య
బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు

♦పొందూర నొక విప్రుని
విందుకు రాబిలిచి
ఎందెందు ఇష్టమనగా
పప్పందే ఇష్టమని బాపడుబలికెన్

❤ఇందు భౌతికస్వభావము వరుస 
చొప్పునఁ జెప్పఁబడుటచే
బాలుఁ డా వరుస నంటు కొని,
 యొకటి రెండు మారులు వినినంతనే
తప్పకుండఁ బదము నప్పగింపఁగలడు❤

.♦.ఎండలు కాసే దెందుకురా?
మబ్బులు పట్టే టందుకురా.
♦మబ్బులు పట్టే దెందుకురా?
వానలు కురిసే టందుకురా.
♦వానలు కురిసే దెందుకురా?
చెరువులు నిండే టందుకురా.
♦చెరువులు నిండే దెందుకురా?
పంటలు పండే టందుకురా.
♦పంటలు పండే దెందుకురా?
ప్రజలు బ్రతికే టందుకురా.
♦ప్రజలు బ్రతికే దెందుకురా?
స్వామిని కొలిచే టందుకురా.
♦స్వామిని కొలిచే దెందుకురా?
ముక్తిని పొందే టందుకుర
(వేటూరి గారి బాల సాహితీ నుండి సేకరణ)

No comments:

Post a Comment